పేద వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్యనే ఏకైక మార్గమని భావించిన తెరాస ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేసిందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోల్లోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో 7 కోట్ల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదులు, క్రీడా మైదానాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
పేద వర్గాల అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గం: సత్యవతి - సత్యావతి రాఠోడ్ తాజా వార్తలు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోల్లోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో 7 కోట్ల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదులు, క్రీడా మైదానాల నిర్మాణ పనులకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ భూమి పూజ చేశారు. పేద వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్యనే ఏకైక మార్గమని భావించిన తెరాస ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేసిందన్నారు.
సత్యవతి రాఠోడ్
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసి, మెరుగైన విద్యను అందిస్తూ సన్న బియ్యంతో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఈ విద్యాలయాలను వినియోగించుకొని గిరిజన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. లింగ నిర్ధరణ పరిక్షలు నిర్వహించి భ్రూణ హత్యలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని అధికారులను ఆదేశించారు.