మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని విశ్రాంతి భవనంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంత్రుల నివాళులు - మహబూబాబాద్ జిల్లా వార్తలు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌లు నివాళులర్పించారు. అనంతరం 'గిఫ్ట్ ఏ స్మైల్'కార్యక్రమంలో భాగంగా ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ అంబులెన్స్‌ను ప్రభుత్వ వైద్యాధికారికి అందజేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంత్రుల నివాళులు
అనంతరం కేటీఆర్ ప్రారంభించిన 'గిప్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ అంబులెన్స్‌ను మంత్రులు.. ప్రభుత్వ వైద్యాధికారి దిలీప్‌కు అందించారు.
ఇవీ చూడండి: ప్రణబ్ నిరుపమాన రాజనీతిజ్ఞుడు.. పాలనా విశారదుడు