దేశవ్యాప్తంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువులో 5 లక్షల 94 వేల చేప పిల్లలను వదిలారు. జిల్లాలో 4.50 కోట్ల చేప పిల్లలను చెరువులలో విడుదల చేస్తున్నామని, ఇంకా అవసరం అనుకుంటే ఎన్ని చేప పిల్లలు అయినా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కేసీఆర్ ముందుచూపుతో మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు' - తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్తలు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువులో పిల్లలను వదిలారు.
talasani srinivas yadav
2018 నుంచి 75 శాతం సబ్సిడీతో రూ.900 కోట్లు విలువ చేసే వివిధ రకాల వాహనాలను మత్స్యకారులకు పంపిణీ చేశామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు భూమిని కేటాయిస్తే... నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బయ్యారం చెరువు వద్ద కావల్సన అవసరాలను డీపీఆర్ తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, ఎమ్మెల్యే హరిప్రియ, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.