మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రేషన్ కార్డులేని 284 మంది నిరుపేదలకు 11 రకాల నిత్యావసర సరుకులను మంత్రి సత్యవతి రాఠోడ్ పంపిణీ చేశారు. కరోనా వైరస్ దరిచేరకుండా ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించాలని సూచించారు. అలాగే భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
'పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం' - Minister Satyawathi rathod Distributes Essential goods
లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో పేదవాళ్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్ పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిసిన వెంటనే పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకుండా ఉండేందుకు దాతలు ముందు రావాలని కోరారు. త్వరలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు.