తల్లిదండ్రులు తనకు ఇష్టంలేకుండా పెళ్లి చేస్తున్నారని ఇంటర్ విద్యార్థిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్ బాలికను సన్మానించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం, మన్నెగూడెంకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదివింది. ఈ వేసవిలో ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. తనకీ పెళ్లి ఇష్టంలేదు.. చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోకపోవడం వల్ల మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసింది.