కూరగాయల మార్కెట్‌లో మంత్రి సత్యవతి - కూరగాయలు కొనుగోలు చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్
మహబూబాబాద్ పట్టణంలోని ఇందిరా సెంటర్‌లో గల కూరగాయల మార్కెట్‌లో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్వయంగా కూరగాయలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కరోనా లాక్‌డౌన్ పరిస్థితులపై మంత్రి ప్రజల్లో అవగాహన కల్పించారు.
స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసిన మంత్రి
మహబూబాబాద్‌లోని ఇందిరా సెంటర్‌లో గల కూరగాయల మార్కెట్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్ స్వయంగా మార్కెట్‌కు వచ్చి కూరగాలు కొనుగోలు చేశారు. మార్కెట్‌లో వినియోగదారులు, వ్యాపారులు భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా కూరగాయలు విక్రయించే వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.