ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ ఆవుల నరేశ్ కుటుంబాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలోని మృతుడి ఇంటికి మంత్రి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి సత్యవతి రాఠోడ్ పరామర్శ - Satyavati rathod has consoled the family of Naresh, a RTC worker
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆవుల నరేష్ కుటుంబాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు.
ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శ
బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. మంత్రి వెంట జడ్పీ ఛైర్పర్సన్ బిందు ఉన్నారు.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన ఆటో.. 11 మందికి తీవ్రగాయాలు