మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో వీధి బాలలు, వలస కూలీలకు మంత్రి సత్యవతి రాఠోడ్ దుస్తులు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఊపిరి పీల్చుకునే సమయంలోనే పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వలస కూలీలు పస్తులు ఉండకుండా చూడటమే సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.
చేతులు జోడించి వేడుకున్న మంత్రి సత్యవతి - దుస్తులు, దుప్పట్లను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి
కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు జరిగే లాక్డౌన్ను రాష్ట్ర ప్రజలంతా సంపూర్ణంగా ఆచరించి, సహకరించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ చేతులు జోడించి వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో వీధి బాలలు, వలస కూలీలకు మంత్రి దుస్తులు, దుప్పట్లను అందజేశారు.
జిల్లాలో 450 నుంచి 500 మంది అనాథలు, పేదవారికి ఆశ్రయం కల్పించి, మూడు పూటలు దాతల సహకారంతో భోజనం అందిస్తున్నామన్నారు. రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు జరిగే దీపాల ప్రదర్శనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వీయ నియంత్రణే.. శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. సామాజిక దూరాన్ని పాటించండి.. కరోనాను తరిమి కొట్టండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డీఎస్పీ నరేష్ కుమార్, వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలి'