రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగు పరచాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డయాగ్నస్టిక్ హబ్ సెంటర్లను మంజూరు చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన వైద్యశాలలో 2 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.
ఈ పరీక్షా కేంద్రంలో 57 రకాల పరీక్షలను చేయవచ్చన్నారు. గతంలో ఈ పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా... కొవిడ్ రోగుల ఇన్ఫెక్షన్ శాతాన్ని కూడా తెలుసుకోవచ్చని సత్యవతి అన్నారు. త్వరలోనే సిటీ స్కాన్ బ్లాక్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.