తెలంగాణ

telangana

ETV Bharat / state

దీక్షిత్​రెడ్డి హత్య కేసులో నిందితుడికి 14 రోజులు రిమాండ్​ - దీక్షిత్​ రెడ్డి హత్య కేసు తాజా వార్తలు

మహబూబాబాద్‌ బాలుని హత్యకేసులో నిందితుడు మంద సాగర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం సాగర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

దీక్షిత్​రెడ్డి హత్య కేసులో నిందితుడికి 14 రోజులు రిమాండ్​
దీక్షిత్​రెడ్డి హత్య కేసులో నిందితుడికి 14 రోజులు రిమాండ్​

By

Published : Oct 24, 2020, 4:56 AM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో హత్యకు గురైన బాలుడు దీక్షిత్‌రెడ్డి తల్లిదండ్రులను మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద లక్ష రూపాయలు అందించారు. ఎంపీ కవిత, మాజీ ఎంపీ సీతారాంనాయక్, వివిధ పార్టీ నాయకులు, జర్నలిస్ట్ సంఘ నేతలు బాధితులను పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షిస్తామని వారికి భరోసానిచ్చారు.

నిందితుడు సాగర్ గతంలో మహబూబాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేశాడు. దీక్షిత్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పాత్రికేయులు మహబూబాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. బాలున్నిఅతిపాశవికంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ... ఘటనపై సమగ్ర విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ఇదీ చూడండి:నిద్ర మాత్రలు ఇచ్చి.. గొంతునులిమి దీక్షిత్‌ హత్య..

ABOUT THE AUTHOR

...view details