మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. తన సోదరుడు కిషన్ సాగు చేసిన వంకాయ తోటను పరిశీలించారు. తోటలో తిరుగుతూ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.
సేంద్రియ సాగు ఎంతో బాగు: మంత్రి సత్యవతి రాఠోడ్ - Minister Satyavathi Rathod
సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చునని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో మంత్రి తన సోదరుడు కిషన్ సాగు చేసిన వంకాయ తోటను పరిశీలించారు.
సేంద్రియ సాగు ఎంతో బాగు: మంత్రి సత్యవతిరాఠోడ్
రసాయన ఎరువుల వినియోగం లేకుండా సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఎక్కువ దిగుబడులు వచ్చినట్లయితే రైతులు ఆర్ధికాభివృద్ధి సాధించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ బిందుతో పాటు పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.