దేశాన్ని అత్యధిక కాలంపాటు పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా తమ కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. రాబోయే రెండు నెలల పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, సంస్థాగత, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఒక పెళ్లితంతులాగా ప్రణాళిక ప్రకారం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.