కొవిడ్-19 వల్ల గత సీజన్లో ధాన్యాన్ని అమ్మకంలో రైతులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈసారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు వేదికలు, పంటల కొనుగోళ్లు, పత్తి, వరి ధాన్యం సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఎక్కువగా సన్న రకాలు వేశారని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. మక్కలు కొనమని సీఎం చెప్పినా.. చాలామంది రైతులు మక్కలు వేశారన్నారు. అయితే వారు నష్టపోవద్దనే ఉద్దేశంతో మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. రైతుల పట్ల సీఎంకున్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు.