తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లా దీవెనలతో వైరస్​ అంతమవ్వాలి: మంత్రి సత్యవతి - మంత్రి సత్యవతి రాఠోడ్​ వార్తలు

రంజాన్​ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసలు ప్రారంభించే ముస్లీంలకు మంత్రి సత్యవతి రాఠోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసాలు పూర్తి చేసే లోగా అల్లా దీవెనలతో కరోనా వైరస్ అంతమవ్వాలని ఆకాంక్షించారు.

minister satyavathi rathod ramadan wishes
అల్లా దీవెనలతో వైరస్​ అంతమవ్వాలి: మంత్రి సత్యవతి

By

Published : Apr 25, 2020, 5:32 AM IST

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాసాలు ప్రారంభించే ముస్లీంలకు మంత్రి సత్యవతి రాఠోడ్ శుభాకాంక్షలను తెలిపారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో ముస్లీంలు ఇంటి వద్దే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ కు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.

విశ్వమానవ కల్యాణం కోసం రంజాన్ ప్రార్థనలు జరగాలని, ఉపవాసాలు పూర్తి చేసే లోగా అల్లా దీవెనలతో కరోనా వైరస్ అంతమవ్వాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ముస్లీం సోదరులు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. మైనార్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.


ఇవీ చూడండి:ముస్లింలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details