రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా మహబూబాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. మంత్రి సత్యవతి రాఠోడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ కాలంలోనే ఎవరూ చదవనన్నీ డిగ్రీలు చదివి, భారత రాజ్యాంగాన్ని రచించిన మహాగొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని మంత్రి వ్యాఖ్యానించారు. పేద, బడుగు, వెనకబడిన వర్గాలు సమాజంలో నిలబడాలని విద్య ఒక్కటే మార్గమని చాటి చెప్పిన వ్యక్తి అని తెలిపారు.
'అణగారిన వర్గాల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తాను' - అంబేడ్కర్ జయంతి
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన కృషి తరతరాలకు గుర్తుండిపోతుందని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ఆమె నివాళులు అర్పించారు.
'అణగారిన వర్గాల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తాను'
వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి వెల్లడించారు. ఈ ఏడు సంవత్సరాల్లో విద్యాసంస్థలను 200 శాతం రెట్టింపు చేశామని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లేందుకు 20 లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. నేను కూడా వెనుకబడిన వర్గం నుంచే వచ్చానని... అణగారిన వర్గాల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:బాబాసాహెబ్‌కు మోదీ, రాహుల్ నివాళి