కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, జడ్పీ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెరాస శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 365 జాతీయ రహదారిని దిగ్బంధించారు.
'కొత్త పథకాలు ప్రవేశపెట్టకున్నా సరే... వ్యతిరేక విధానాలొద్దు' - bharat bandh updates
మహబూబాబాద్ జిల్లాల్లో భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. రైతులకు మద్దతుగా మంత్రి సత్యవతి రాఠోడ్, జడ్పీ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడుతూంటే... కేంద్రంలో మాత్రం మోదీ ప్రభుత్వం ఏడేళ్లుగా రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మంత్రి విమర్శించారు. భాజపా ప్రభుత్వం రైతులకు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టకున్నా... రైతు వ్యతిరేక విధానాలను అవలంభించొద్దని కోరారు. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ... కేంద్ర మంత్రి రాజీనామా చేసిన ప్రధానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మంత్రి సత్యవతి రాఠోడ్, జడ్పీ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ , తెరాసా శ్రేణులను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు.