మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మంత్రి పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాఠోడ్ - తెలంగాణ వార్తలు
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాఠోడ్
మార్కెట్లో డిమాండ్‌కు తగిన పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకే రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 82 రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ బిందు, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతం, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.