మహబూబాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వైరస్ ను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కరోనా పరిస్థితులపై ఆమె వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు తగు సూచనలు చేస్తే.. వాటిని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు.
అందరికీ సకాలంలో కిట్లు అందించాలి : సత్యవతి రాఠోడ్ - మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష
మహబూబాబాద్ జిల్లాలో కొవిడ్ కేసుల పరిస్థితులపై జిల్లా వైద్యాధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. హోం ఐసోలేషన్ లో ఉండే కొవిడ్ బాధితులకు సరైన సమయంలో కిట్లను అందజేయాలని మంత్రి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
కరోనాపై మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష
అలాగే వైద్యులకు కావాల్సిన పీపీఈ కిట్లు, కనీస సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాజిటివ్ నిర్ధరణై హోం ఐసోలేషన్ ఉంటున్న వారికి ప్రభుత్వ కిట్లను అందజేయాలని సూచించారు. ప్రతి ఐసోలేషన్ కుటుంబంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులకు చెప్పారు. ప్రజలు కరోనా పాజిటివ్ అనగానే కంగారు పడకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుని ధైర్యంగా ఉండాలన్నారు.