మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి ఆ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కష్ట కాలంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 వేల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల అడ్డుకట్టకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వారం రోజుల్లో మహబూబాబాద్‌కు ఈఎన్సీ అధికారులు రానున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్క చెరువుకు ఎస్సారెస్పీ జిల్లాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి :సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన