Minister Satyavathi Rathod: తెలంగాణ ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలోని మహిళలకు సమాజంలో గౌరవం దక్కిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు కేసీఆర్ కిట్ లను అందచేశారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన బాలింతలకు 16 వస్తువులతో కూడిన ఒక కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్, సఖి సెంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందిని సన్మానించారు.