మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో మంత్రి సత్యవతి రాఠోడ్ తన నివాసంలో ఫాదర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. తన తల్లిదండ్రులైన గుగులోతు లింగ్యానాయక్-దస్మీ దంపతులతో కేకు కట్ చేయించారు.
తల్లిదండ్రులే నా ప్రేరణ: మంత్రి సత్యవతిరాఠోడ్ - తల్లిదండ్రులే నా ప్రేరణ
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఫాదర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. తండాలోని తన నివాసంలో కేకు కట్ చేసి తల్లిదండ్రులకు తినిపించారు.
![తల్లిదండ్రులే నా ప్రేరణ: మంత్రి సత్యవతిరాఠోడ్ Minister Satyavathi Rathod Fathers day Celebrations in Mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7715858-84-7715858-1592767315502.jpg)
ఫాదర్స్ డే వేడుకల్లో మంత్రి సత్యవతి
తల్లిదండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకొన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ బిందుతో పాటు మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
TAGGED:
తల్లిదండ్రులే నా ప్రేరణ