మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పాత్రికేయులకు మాస్కులు, శానిటైజర్లను మంత్రి సత్యవతి రాఠోడ్ పంపిణీ చేశారు. లాక్డౌన్ సడలింపులతో కరోనా వైరస్ అంతరించిందని అనుకోవద్దని పేర్కొన్నారు.
'కరోనాతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి' - Minister Satyavathi Rathod Distributes Masks and Sanitiser
వలస కార్మికులు కరోనాను కావాలని కొని తెచ్చుకోలేదని, పరిస్థితులను బట్టి వారికి సోకిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. జిల్లాలో కరోనా నివారణ కోసం కలెక్టర్, వైద్యులు తీవ్రంగా కృషిచేస్తున్నారని ఆమె వెల్లడించారు.
!['కరోనాతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి' Minister Satyavathi Rathod Distributes Masks and Sanitiser for journalists in Mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7333973-1090-7333973-1590342753569.jpg)
'కరోనాతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి'
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రావద్దని తెలిపారు. వలస కూలీల సహాయార్థం శ్రీనివాస రెడ్డి, శ్రీధర్, సురేష్ రావులు అందజేసిన మూడు లక్షల చెక్కును మంత్రి కలెక్టర్కు అందించారు.