స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, 500 రూపాయల నగదును ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందుతో కలిసి పంపిణీ చేశారు. మరో చోట లయన్స్ క్లబ్, ఆర్ఆర్ యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి - coronavirus news
మహబూబాబాద్ జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని సూచించారు. మహబూబాబాద్ పట్టణంలో ఉన్న 215 మంది వలస కూలీలకు గిరిజన వసతి గృహంలో వసతి కల్పించామని మంత్రి వెల్లడించారు.
minister satyavathi rathod