రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని దైవ కృప పిల్లల అనాథ ఆశ్రమంలోని పిల్లల మధ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు.
అనాథాశ్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్ క్రిస్మస్ వేడుకలు - mahaboobabad christmas celebrations
మహబూబాబాద్‌లోని ఓ అనాథాశ్రమంలోని పిల్లలతో మంత్రి సత్యవతి రాఠోడ్ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్థానిక వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆశ్రమాల్లో బాగా చదువుకునే విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తామని హామీ ఇచ్చారు.
minister satyavathi rathod celebrated christmas with orphans
కొవిడ్ సమయంలో రాష్ట్రంలోని ఆశ్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి సహాయ సహకారాలను అందించామన్నారు. ఆశ్రమంలో బాగా చదువుకునే విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆశ్రమాల్లో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తన శాఖ తరఫున అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పాఠశాలలకు వెళ్లలేని పిల్లలకు కూడా అన్ని విధాలా సాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.