ప్రజలకు రాష్ట్ర గిరిజన , స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలను తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో ఇళ్లలోనే ఉండి మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో మహిళలంతా ఒక దగ్గర గుమిగూడితే మళ్లీ విజృంభించే అవకాశం ఉందని అన్నారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన కోరికలు ఫలించాలనే నమ్మకంతో ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుందన్నారు.
రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాఠోడ్ బతుకమ్మ శుభాకాంక్షలు - bathukamma panduga
కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉండి మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
![రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాఠోడ్ బతుకమ్మ శుభాకాంక్షలు Minister Satyavathi Rathod Batukamma wishes to telangana people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9195269-402-9195269-1602835909286.jpg)
రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాఠోడ్ బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలను ఏకం చేసిన పండుగ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. మహిళలు ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఏటా కోటి మంది మహిళలకు రంగురంగుల డిజైన్లతో కూడిన చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
ఇవీ చూడండి: నేటి నుంచే బతుకమ్మ సంబురాలు.. కనిపించని సందడి