ఎల్ఆర్ఎస్పై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాద్ధాంతం చేస్తున్నారని.. గత ప్రభుత్వాల హయాంలో ఈ పద్ధతి లేదా అంటూ స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో వ్యవసాయేతరుల ఆస్తుల వివరాల నమోదు సర్వేలో మంత్రి తన ఆస్తి వివరాలను వెల్లడించారు.
'ఎల్ఆర్ఎస్పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి' - బతుకమ్మ చీరల పంపిణీ లేటెస్ట్ వార్తలు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఆస్తుల వివరాల నమోదు సర్వేలో మంత్రి సత్యవతి రాఠోడ్.. తన ఆస్తి వివరాలను అధికారులకు వెల్లడించారు. అనంతరం గిరిజన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
!['ఎల్ఆర్ఎస్పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి' minister satyavathi rathod batukamma saree distribution at kuravi in mahabuabbad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9145996-556-9145996-1602494426665.jpg)
'ఎల్ఆర్ఎస్పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు'
ప్రజలకు మేలు చేసేందుకే ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నామని.. దీనిపై అనవసర రాజకీయం వద్దని అన్నారు. ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయడం వల్ల.. వివాదాలకు చెక్ పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అనంతరం బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను గిరిజన మహిళలకు సత్యవతి రాఠోడ్ పంపిణీ చేశారు.