తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే​తో మంత్రి సత్యవతి రాఠోడ్ బుల్లెట్​​ రైడ్​ - మహబూబాబాద్​ జిల్లా వార్తలు

గిరిజన ప్రాంతాలకు 6 మెడికల్ కళాశాలలను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్​కు పాదాభివందనం చేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్​ జిల్లాకేంద్రంలోని నెహ్రూసెంటర్​లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం బుల్లెట్ వాహనంపై ఎమ్మెల్యే శంకర్​నాయక్​తో కలిసి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

minister satyavathi rathod
మహబూబాబాద్​ జిల్లాకేంద్రంలోని నెహ్రూసెంటర్​లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : May 18, 2021, 4:41 PM IST

Updated : May 18, 2021, 5:35 PM IST

గిరిజన సంక్షేమమే లక్ష్యంగా వైద్య కళాశాలలు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్​కు మంత్రి సత్యవతి రాఠోడ్ ధన్యవాదాలు తెలిపారు. మహబూబాబాద్​ జిల్లాకేంద్రంలోని నెహ్రూసెంటర్​లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ బుల్లెట్​ వాహనంపై ఎమ్మెల్యే శంకర్ నాయక్​తో కలిసి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

మహబూబాబాద్

మహబూబాబాద్​లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి అప్ గ్రేడ్ అయిందని. త్వరలోనే ప్రారంభించబోతున్న మెడికల్, నర్సింగ్ కళాశాలలు, మెడికల్ సబ్ సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి పాదాభివందనాలు తెలియజేశారు. బలహీన వర్గాల వారికి నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్​దేనన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. మల్యాలలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మహబూబాబాద్​లో బుల్లెట్ వాహనంపై మంత్రి సత్యవతి రాఠోడ్

ఇదీ చూడండి:'పక్కా ప్రణాళికతో జూన్​లో కరోనా తగ్గిపోవచ్చు'

Last Updated : May 18, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details