తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయంలో మౌలిక మార్పులకే రైతు వేదికలు: సత్యవతి రాఠోడ్‌ - మహబూబాబాద్​ జిల్లా తాజా వార్తలు

వ్యవసాయ రంగంలో మౌలిక మార్పులకు నాంది పలికేందుకు రైతు వేదికల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్‌ తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేసి పరిశోధనలకు తగిన ప్రాధాన్యాన్ని తెరాస ప్రభుత్వం ఇస్తుందన్నారు. లాభసాటి పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు.

వ్యవసాయంలో మౌలిక మార్పులకే రైతు వేదికలు: సత్యవతి రాఠోడ్‌
వ్యవసాయంలో మౌలిక మార్పులకే రైతు వేదికలు: సత్యవతి రాఠోడ్‌

By

Published : Jul 23, 2020, 12:11 AM IST

వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు సృష్టించి, ఉత్పాదకత పెంచి మార్కెటింగ్ వ్యవస్థపై తెరాస ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రతిమడుగులో రూ. 22 లక్షల వ్యయంతో చేపట్టే రైతు వేదిక నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. రైతు వేదిక నిర్మాణానికి ఆమె భర్త గోవింద్ రాఠోడ్ జ్ఞాపకార్థం రూ. 13 లక్షలు అందించారు.

వ్యవసాయ రంగంలో మౌలిక మార్పులకు నాంది పలికేందుకు రైతు వేదికల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేసి పరిశోధనలకు తెరాస ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందన్నారు. లాభసాటి పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. నియంత్రిత సాగు విధానం వచ్చే మూడేళ్ళలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పనులు వేగవంతం చేసి దసరా నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ABOUT THE AUTHOR

...view details