మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు, 15 పోలీస్ చెక్పోస్ట్లకు కూలర్లను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పంపిణీ చేశారు. జిల్లాలో ఒక పాజిటివ్ కేసు వచ్చినప్పుడు అందరం హడలిపోయామని, కలెక్టర్, పోలీస్, వైద్య సిబ్బంది, అధికార యంత్రాంగమంతా పటిష్ఠ ప్రణాళికతో పనిచేసి.. ఎక్కడికక్కడ కట్టడి చేయగలిగామన్నారు.
పటిష్ఠ ప్రణాళికతో కట్టడి చేశాం: మంత్రి సత్యవతి - మహబూబాబాద్ వార్తలు
కట్టడి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య సామాగ్రిని కలెక్టర్ వీపీ గౌతమ్, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ ఛైర్మన్ బిందుతో కలిసి ప్రారంభించారు.
పటిష్ఠ ప్రణాళికతో కట్టడి చేశాం: మంత్రి సత్యవతి
వైరస్ కట్టడికి కృషి చేస్తున్న అధికారులను, పేదలను ఆదుకుంటున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రూప్లాల్, మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి , డాక్టర్ల బృందం పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఐదు దశల్లో లాక్డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...
Last Updated : Apr 25, 2020, 11:13 PM IST