మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ఇంట్లోని కిచెన్, హాల్, కిటికీలను, ఫ్రిజ్‌ను శుభ్ర పరిచారు. అలాగే ఇంటి ఆవరణలోని గార్డెన్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. పూల కుండీల్లో ఉన్న చెత్తను, నీటిని తొలగించి కొత్త నీటిని పోశారు.
ఇంటిని శుభ్రం చేసుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్ - ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాఠోడ్
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సత్యవతి రాఠోడ్. అందులో భాగంగానే తన ఇంటిని, పరిసరాలను స్వయంగా ఆమే శుభ్రపరిచారు.
ఇంటిని శుభ్రం చేసుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్
వర్షాకాలంలోనూ దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకే తాను ఇంటిని శుభ్రం చేసుకున్నట్లు మంత్రి వివరించారు. ప్రజలందరూ ప్రతి ఆదివారం పది గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
TAGGED:
మంత్రి సత్యవతి రాఠోడ్