కరోనా రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉన్నందున అందరూ విధిగా మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సహా పలు వీధులను పరిశీలించారు. ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. టెలీ మెడిసిన్ సేవలను అందించడానికి ముందుకు వచ్చిన ప్రైవేటు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా కట్టడికి అందరి కృషి అవసరం: మంత్రి సత్యవతి - తెలంగాణ వార్తలు
కరోనా విపత్కర సమయంలో అందరూ విధిగా మాస్కులు ధరించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ను మంత్రి సందర్శించారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
జిల్లాకు సమీకృత మార్కెట్‌ను మంజూరు చేశారని... త్వరలో నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, రహదారుల విస్తరణకు పలుచోట్ల ఉన్న అడ్డంకులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని... అది మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్, ఐఎంఏ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సరఫరా ఆగొద్దు.. ముప్పు కలగొద్దు
TAGGED:
mahabubabad district news