మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం శివారు సీతారాంపురం తండాలో ఇటీవల అత్యాచారంతో పాటు హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్నిగిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(Sathyavathi Rathod) పరామర్శించారు. ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. దోషులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్నారు.
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ప్రస్తుతం రూ.25 వేల అందజేశారు. మంత్రి వ్యక్తిగతంగా రూ.10 వేలు అందజేశారు.