తెలంగాణ

telangana

'30 కోట్ల మొక్కలు నాటడమే ఆరో విడత హరితహారం లక్ష్యం'

తెలంగాణలో 30 కోట్ల మొక్కలు నాటడమే ఆరో విడత హరితహారం కార్యక్రమం ఉద్దేశ్యమని మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రాష్ట్రం పచ్చగా ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారాన్ని అమలు చేస్తున్నారని వెల్లడించారు.

By

Published : Jun 25, 2020, 3:33 PM IST

Published : Jun 25, 2020, 3:33 PM IST

'30 కోట్ల మొక్కలు నాటడమే ఆరో విడత హరితహారం లక్ష్యం'
'30 కోట్ల మొక్కలు నాటడమే ఆరో విడత హరితహారం లక్ష్యం'

రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా ప్రభుత్వం ఆరో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. స్థానిక పార్కు సమీపంలో మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాటికి సంబంధించిన ఖర్చు వివరాలను ఆవిష్కరించారు.

మరిపెడలో ఆరో విడత హరితహారం కార్యక్రమం

గతంలో ఉన్న అడవులను కోల్పోయామని సత్యవతి పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల వర్షాభావం వంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. 29 వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కన్నా ముందు వరసలో నిలిపేందుకు, రాష్ట్రం పచ్చగా ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారాన్ని అమలు చేస్తున్నారని వెల్లడించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చి పంచాయతీలకు నేరుగా నెలకు రూ. 339 కోట్లు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శులను నియమించినట్లు తెలిపారు. హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు పటిష్టమైన యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.

డోర్నకల్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచి కాళేశ్వరం జలాల ద్వారా అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి అన్ని చెరువులు, కుంటలు నింపి సాగునీరు అందించారని మంత్రి తెలిపారు. కోనసీమలో ఉన్నట్లుగా డోర్నకల్ ప్రాంతం ఉండాలని సీఎం కేసీఆర్​ ఆలోచిస్తున్నారన్నారు.

ఇవీ చూడండి:హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details