తెలంగాణ

telangana

ETV Bharat / state

అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన మంత్రి సత్యవతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని మంత్రి సత్యవతి రాఠోడ్ దగ్గర ఉండి ఆస్పత్రికి తరలించిన సంఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తిని పోలీస్​ వాహనంలో ఆస్పత్రికి తరలించి.. హైదరాబాద్​ వెళ్లారు.

By

Published : Jun 10, 2020, 12:27 PM IST

అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన మంత్రి సత్యవతి
అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన మంత్రి సత్యవతి

అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన మంత్రి సత్యవతి

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ తన ఉదారత చాటుకున్నారు. మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మండలం బంజర స్టేజి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గర ఉండి ఆస్పత్రికి తరలించారు.

మహబూబాబాద్​ నుంచి హైదరాబాద్​ వెళ్తుండగా రోడ్డు మీద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో కిందపడి ఉండటాన్ని గమనించి తన కాన్వాయి ఆపి దిగారు మంత్రి. అతన్ని పోలీస్​ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. తిరిగి హైదరాబాద్​ వెళ్లిపోయారు. గాయపడిన వ్యక్తి మునిగలవీడు గ్రామానికి చెందిన పశు వైద్యుడు గోపాలమిత్ర కుమారస్వామిగా గుర్తించారు.

ఇదీ చదవండి:అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details