కరోనా కట్టడికి రాష్ట్రంలో పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. బాధితులకు అందుబాటులో ఉండేలా స్థానికంగానే కరోనా వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని జడ్పీ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ వి.పి గౌతమ్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రంలో 20 ఆక్సిజన్ సదుపాయం గల బెడ్లు, మరో 10 అబ్జర్వేషన్ పడకలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టాం: మంత్రి సత్యవతి - తెలంగాణ వార్తలు
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు చేపట్టామని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఆక్సిజన్ సౌకర్యం, మందులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. గార్ల మండలంలో ఏర్పాటు చేసిన కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

మంత్రి సత్యవతి రాఠోడ్, గార్ల ఐసోలేషన్ కేంద్రం
జిల్లాలో కొవిడ్ రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు దాదాపు 200 ఆక్సిజన్ సదుపాయం గల పడకలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. రెమిడిసివర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, మందులు అందుబాటులో ఉన్నాయని... రోగులు ధైర్యంగా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి:పల్లెలపై కొవిడ్ పడగ.. వేలల్లో సిబ్బంది కొరత