రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా తెరాస ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మొక్కలు నాటి, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివిధ వార్డుల్లో తిరుగుతూ మొక్కలు నాటి, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, వస్త్రాలను పంపిణీ చేశారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే - mahabubabad distrct news
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా తెరాస ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహబూబాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మొక్కలు నాటి, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే
ప్రియతమ నాయకుడి పుట్టినరోజును ఈవిధంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తెరాస శ్రేణులు పలు కార్యక్రమాలను నిర్వహించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కేటీఆర్ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు'