Minister Harishrao Road Show In Mahabubabad : సమైక్య వాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని బీఆర్‌ఎస్‌నేత హరీశ్ రావు మానుకోట ఘటనను గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్(BRS Candidate Shankar naik) గెలుపును కోరుతూ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరిగెత్తారని, మళ్లీ సమైక్యవాదులు ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారని, వారికి మన మానుకోట దమ్మేంటో చూపించాలని కోరారు. శంకర్ నాయక్ నోరు కఠినమైనా సిద్ధిపేట కంటే అభివృద్ధి బాగా చేశారని, గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా, మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ వచ్చేదా అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు సీఈసీ వార్నింగ్ - అలా చేస్తే చర్యలు తప్పవంటూ లేఖ
Harishrao Fires On Congrss :పోడు భూములకు పట్టాలు ఇచ్చామని, రాహుల్ గాంధీ(Rahul Gandi), ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశారని, కర్ణాటకలో కరెంటు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రేవంత్‌రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా.. రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాలా.. అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడే నాయకులు కావాలా.. భవిష్యత్తు అందించే నాయకుడు కావాలో.. మీరే ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. బోరింగులు మాయమైపోయాయని, ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయని హరీశ్ కితాబిచ్చారు. ఉచిత కరెంటు అని చెప్పి ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకు ఓటు గుద్దు.. రిస్క్ వద్దు అనుకుంటే కారుకు గుద్దాలని.. కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
రైతుబంధు నిధుల విడుదలతో కేసీఆర్, మోదీ బంధం బయటపడింది : రేవంత్ రెడ్డి