ప్రభుత్వ వైద్యశాలల్లో ఉన్న సౌకర్యాలు, మందులు అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నాయని.. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ చికిత్సను అందిస్తుంది. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కొవిడ్ వార్డును సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సందర్శించారు.
రూపాయి ఖర్చు లేకుండా చికిత్స అందిస్తున్నాం: మంత్రి ఈటల - రూపాయి ఖర్చు లేకుండా చికిత్స అందిస్తున్నాం: మంత్రి ఈటల
జ్వరం, దగ్గు, జలుబు, వంటి నొప్పులు సహా ఇంకా శరీరంలో ఏదైనా మార్పులు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కొవిడ్ వార్డును సందర్శించారు.
రూపాయి ఖర్చు లేకుండా చికిత్స అందిస్తున్నాం: మంత్రి ఈటల
రోగులకు అందుతున్న సౌకర్యాలు... వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శరీరంలో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ సోకితే భయపడవద్దని... తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి బారి నుంచి బయట పడొచ్చన్నారు.
ఇదీ చూడండి: 'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'