గ్రామాల్లో మాస్కులు లేకుండా కనిపిస్తే జరిమానాలు విధించడంతో పాటు కఠినంగా శిక్షిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మాహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మూడు గ్రామాల్లో 5 పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల... ఆయా గ్రామాల్లో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని గ్రామస్థులను కోరిన మంత్రి ఎర్రబెల్లి.... కరోనా బాధిత కుటుంబాల పట్ల వివక్ష చూపవద్దని విజ్ఞప్తి చేశారు.
డేంజర్ జోన్లో మంత్రి ఎర్రబెల్లి - మాహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మూడు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. అక్కడ ఇప్పటికే 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని మంత్రి సూచించారు.
డేంజర్ జోన్లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి
Last Updated : May 23, 2020, 12:32 PM IST