తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా బాధితులు భయపడకండి.. మీకు అండగా నేనున్నాను' - teleconference with officers at mahabubabad at minister errabelli

మహబూబాబాద్​ జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్​లో తెలిపారు. హోంక్వారంటైన్​లో ఉన్న కరోనా బాధితులు ఎవరూ భయపడకూడదని.. వారికి అండగా మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

teleconference with officers at mahabubabad at minister errabelli
'కరోనా బాధితులు భయపడకండి.. మీకు అండగా నేనున్నాను'

By

Published : Sep 1, 2020, 5:39 PM IST

మహబూబాబాద్​ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. హోంక్వారంటైన్​లో ఉన్న కరోనా బాధితులు, వారి కుటుంబసభ్యులెవరూ భయపడకూడదని.. మీకు అండగా నేనున్నాని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మరీ సమస్యగా ఉంటే.. తనకు గానీ.. తన సిబ్బందికి గానీ ఫోన్​ చేయాలని సూచించారు.

పాలకుర్తి, తొర్రూరులో కరోనాకు అందుబాటులో అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉంటామని.. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో అద్భుత‌మైన వైద్య సేవ‌లు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్ర‌ణ‌, భౌతిక దూరంతో, మాస్కులు ధరించాలని మంత్రి సూచించారు.

ఇదీ చూడండి:-యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details