తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర విధానాలను దేశమంతా కొనియాడుతోంది' - 'రాష్ట్ర విధానాలను దేశమంతా కొనియాడుతోంది'

భాజపా నేతలు అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మండిపడ్డారు. ప్రతీ చిన్న విషయాన్ని అవకాశ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MINISTER ERRABELLI DHAYAKER RAO FIRE ON BJP LEADERS
MINISTER ERRABELLI DHAYAKER RAO FIRE ON BJP LEADERS

By

Published : Dec 10, 2019, 7:00 PM IST

రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలను దేశమంతటా కొనియాడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పర్యటించిన మంత్రి... భాజపా నేతలపై విరుచుకుపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కనీస అవగాహన లేకుండా... ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పాటించిన విధానాలను ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్​మోహన్​రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కొనియాడారని గుర్తుచేశారు. రాష్ట్రానికి పలు విషయాల్లో అవార్డులు వచ్చినా... నిధుల విడుదల విషయంలో మాత్రం మొండిచేయ్యే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

'రాష్ట్ర విధానాలను దేశమంతా కొనియాడుతోంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details