మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.... కాంట్రాక్టర్‌ను మార్చాలని అధికారులను ఆదేశించారు.
'జిల్లా ఆస్పత్రిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు' - పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్‌లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
!['జిల్లా ఆస్పత్రిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు' minister errabelli dayakar rao sudden visit to mahabubabad district hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5445300-thumbnail-3x2-a.jpg)
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మహబూబాబాద్ ఆస్పత్రిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, సరైన రీతిలో వైద్యం అందుబాటులో లేదంటూ ఫిర్యాదులు రావడం వల్లే ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
- ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ