వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి - sanitisers
తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జిల్లా కలెక్టర్ గౌతమ్ పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఎన్-95 మాస్కులను పంపిణీ చేశారు.
వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లయన్స్ భవన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఎన్-95 మాస్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ గౌతమ్ ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని మంత్రి ప్రజలకు సూచించారు. అందరూ భౌతికదూరం పాటించాలని ఆయన వెల్లడించారు.
ఇవీ చూడండి: ఆయనకు కరోనా లేదు.. ఆ బిల్లులు తప్పే: యశోదా ఆస్పత్రి