తెలంగాణ

telangana

ETV Bharat / state

'దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగ చేసిన గొప్పవ్యక్తి కేసీఆర్​' - Minister Errabelli Dayakar Rao latest news

మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

Minister Errabelli Dayakar Rao inaugurated the grain purchasing centers in  Mahabubabad District
'దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగ చేసిన గొప్పవ్యక్తి కేసీఆర్​'

By

Published : Nov 7, 2020, 3:45 PM IST

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. మంత్రి ఎర్రబెల్లితో పాటుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్, తొర్రూరు పీఎస్​సీఎస్ ఛైర్మన్ హరి ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

రైతులు పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధరణితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందని తెలిపారు. దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండగ చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details