కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి... ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరితే.. ఒక్క మెడికల్ కళాశాలను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అదే పక్క రాష్ట్రమైన ఏపీకి ఏడు కాలేజీలను మంజూరు చేసిందని విమర్శించారు. భాజపా ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్... పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని కేంద్రం నుంచి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి - Minister Errabelli Dayakar Speech
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాజపాపై విరుచుకుపడ్డారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి
భాజపా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెండు కోట్ల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని మండిపడ్డారు. నైతిక విలువలు లేని పార్టీగా భాజపా మిగిలిపోయిందని ఆరోపించారు.
- ఇదీ చూడండి: ప్రశ్నించాలనే ఈసారి మండలి బరిలో దిగా: ఎల్.రమణ
Last Updated : Mar 6, 2021, 2:33 PM IST