రేవంత్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం కావాలనే సర్పంచ్‌లను రెచ్చగొడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్లు రావాలని పేర్కొన్న ఆయన.. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.230 కోట్లు ఇస్తుందని తెలిపారు. రేపు మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రేవంత్‌లకు మంత్రి ఎర్రబెల్లి సవాల్.. ఏంటంటే..?
తెలంగాణలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్టు చూపిస్తే రాజీనామాకు సిద్ధమని రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కొంతమంది నాయకులు సర్పంచ్‌లను రెచ్చగొట్టి గవర్నర్ వద్దకు పంపుతున్నారని మండిపడిన ఎర్రబెల్లి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన ఉండి మాట్లాడుతున్నారో.. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్టు చూపిస్తే రాజీనామాకు సిద్ధమని రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: