సీఎం కేసీఆర్, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీక్షిత్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో కిడ్నాప్‌తో పాటు హత్యకు గురైన దీక్షిత్ చిత్రపటంపై ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి ఎర్రబెల్లి.. పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
దీక్షిత్ కుటుంబానికి చాలా అన్యాయం జరిగిందని, కిడ్నాపర్ తెలిసిన వ్యక్తి కాబట్టే అతను పిలిస్తే వెళ్లాడని మంత్రి పేర్కొన్నారు. ఈ కేసుని పోలీసులు చాలా చురుగ్గా డీల్ చేశారని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం చేశామని, ప్రజల్లో వేరే విధమైన అనుమానాలున్నాయని వెల్లడించారు.