లాక్డౌన్ సమయంలో కర్నాటకలో చిక్కుకున్న మహబూబాబాద్ జిల్లా వలస కార్మికులు తామూ రాష్ట్రానికి రావడానికి సహకరించాలని మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్ మహబూబాబాద్‌కు తీసుకురావాలని మంత్రి సత్యవతి రాఠోడ్‌కు రీట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి సత్యవతి అక్కడి వలస కార్మికులను జిల్లాకు రప్పించేందుకు సొంత ఖర్చుతో రెండు బస్సులను ఏర్పాటు చేయించారు.
మంత్రి ఆదేశాల మేరకు
వారికి అక్కడి అధికారులతో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణకు రావడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కలెక్టర్ గౌతమ్ కర్నాటక అధికారులతో మాట్లాడి వారిని మహబాబూబాద్ చేరేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.