తెలంగాణ

telangana

ETV Bharat / state

'మమ్మల్ని స్వస్థలాలకు చేర్చిన మంత్రులకు కృతజ్ఞతలు' - migrant labor reached to native from karnataka

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్ నుంచి మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు 50 మంది వలస కార్మికులు వచ్చారు. వారందరికి జిల్లా అధికారులు హోంక్వారంటైన్ ముద్ర వేసి పలు సూచనలు చేశారు.

quarantine
quarantine

By

Published : May 21, 2020, 11:29 AM IST

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం, గుడూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 50 మంది వలస కార్మికులు కర్ణాటక నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. వీరికి జిల్లా యంత్రాంగం దగ్గరుండి వైద్య పరీక్షలు నిర్వహించి, హోమ్ క్వారంటైన్ ముద్ర వేశారు. ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.

కర్ణాటకలో చిక్కుకున్న తాము మంత్రి కేటీఆర్, సత్యవతి రాఠోడ్​ల చొరవతో స్వగ్రామాలకు చేరుకున్నామని వలస కూలీలు చెప్పారు. తమకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details