తెలంగాణ

telangana

ETV Bharat / state

కామ దహనం.. పూలు చల్లుకున్న మార్వాడీలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మార్వాడీలు కామదహనం ఘనంగా చేశారు. పాటలు పాడుకుంటూ భజనలు, నృత్యాలు చేస్తూ కాముడి దహనం నిర్వహించారు.

marwadis kama dhyanam at mahabubabad district
కామ దహనం.. పూలు చల్లుకున్న మార్వాడీలు

By

Published : Mar 9, 2020, 11:06 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మార్వాడి సమాజ్​ ఆధ్వర్యంలో మార్వాడీలు కామదహన కార్యక్రమం నిర్వహించారు. మార్వాడీ మహిళలు ఊడ్చి, కళ్లాపి చల్లి ముగ్గులు వేసి ఆముదం చెట్టును నాటారు. దాని చుట్టూ ఆవు పిడకలతో చేసిన దండలను అలంకరించారు.

పాటలు పాడుకుంటూ దాని చుట్టూ భజనలు, నృత్యాలు చేసుకుంటూ కాముడిని దహనం చేశారు. పురుషులు, మహిళలు ఒకరిపై ఒకరు రంగులు, పూలు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. నిండు పౌర్ణమి వేళ ఈ వేడుకలను జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది.

కామ దహనం.. పూలు చల్లుకున్న మార్వాడీలు

ఇదీ చూడండి :అందమైన అమ్మాయి... ఆకట్టుకుంది ఈ వేళ

ABOUT THE AUTHOR

...view details